Sundaragiri | చిగురుమామిడి, ఏప్రిల్ 6: శ్రీరామనవమి పర్వదినం వేడుకలను మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుందరగిరి, చిగురుమామిడి, రేకొండ, ములుకనూరు, నవాబుపేట, ఇందుర్తి, బొమ్మనపల్లి, రామంచ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించారు.
భక్తులు కట్నకానుకలతో పాటు ఓడిబియ్యం సీతారామ కళ్యాణం లో సమర్పించారు. అనంతరం అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాలు శ్రీరామనామ స్మరణలతో మార్మోగింది.