Sports inspire | సిరిసిల్ల రూరల్, జూలై 19 : క్రీడా పోటీ లు ఉత్సాహంతో పాటు పోరాట స్ఫూర్తినిస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ లతో కలిసి మొదటి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
తర్వాత సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్, మాజీ జడ్పీటీసీ కోడి ఆంతయ్య, మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్లా మధు, మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ రావు, మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్ ,భాస్కర్, చిలివేరి నర్సయ్య, గుగ్గిళ్ల అంజయ్య, అమర్ రావు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.