రాజన్న సిరిసిల్ల, మే 23 (నమస్తే తెలంగాణ)/తెలంగాణచౌక్/ ఎల్లారెడ్డిపేట: యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. యువత క్రీడ ల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి, స్వీ య క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చా రు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్-20 24 కార్యక్రమంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడారు.
యువత వ్యసనాలకు బానిసై, బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు, మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో దోస్తీమీట్-2024లో క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. యువత చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు రఘుపతి, సదన్‌కుమార్, శ్రీనివాస్, ఎస్ఐలు సుధాకర్, రమాకాంత్ ఉన్నారు.
రుద్రంగి, మే 23: గ్రామీణ ప్రాంత యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఏఎస్పీ చం ద్రయ్య సూచించారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో దోస్త్ మీట్ కార్యక్రమంలో భాగంగా మండల స్థా యి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు. ఇక్కడ చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట, మే 23: క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని సీఐ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నా రు. మండల కేంద్రంలోని కేజీ టూ పీజీ మైదానం లో దోస్త్ మీట్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఇక్కడ ఏఎస్ఐ బాపు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్ ఉన్నారు.
ముస్తాబాద్, మే 23: దేశ భవిష్యత్ నేటి యువ త చేతుల్లో ఉందని సిరిసిల్ల రూరల్ సీఐ సదన్‌కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల దోస్తీ మీట్లో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ ఏఎస్ఐ వెంకటరమణ, సిబ్బంది ఉన్నారు.
ఇల్లంతకుంట, మే 23: దోస్తీమీట్ క్రీడా పోటీలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ సీఐ సదన్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాలీబాల్, కబడ్డీ పోటీలను సీఐ ప్రారంభించారు. ఇక్కడ ఎస్ఐ రాజుగౌడ్, సిబ్బంది ఉన్నారు.
వీర్నపల్లి, మే 23: దోస్త్మీట్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎస్ రమేశ్ గురువారం ప్రారంభించారు. మారుమూల ప్రాంత క్రీడాకారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. ఇక్కడ నేతలు మల్లేశం, రవి, అజయ్, శేఖర్, పీఈటీలు, సిబ్బంది ఉన్నారు.
చందుర్తి, మే 23: మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దోస్తీ మీట్-2024 క్రీడాపోటీలను ఏఎస్పీ చంద్రయ్య ప్రారంభించారు. ఇకడ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.