Police cricket match | వినాయక్ నగర్, జూన్ 22: పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డివిజన్, బోధన్ సబ్ డివిజన్, ఆర్ముడ్ రిజర్వ్ విభాగం, అలైడ్ బ్రాంచులు, హోమ్ గార్డ్స్ మొదలగు విభాగాల మధ్య పోలీస్ క్రికెట్ మ్యాచ్ లను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రజా రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవడం వల్ల క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. పోలీసు సిబ్బంది నిత్యం ఒత్తిడిలో ఉంటూ విధులు నిర్వహిస్తూ ఉంటారని, వారికి క్రీడలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని, స్పోర్ట్స్ లో పాల్గొని రిఫ్రెష్ అయిన పోలీసులు తిరిగి మరింత ఉత్సాహంతో విధుల్లో బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. సమయం దొరికినప్పుడు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. పోలీసులు ఉద్యోగ వృత్తిలో ఎంతో బిజీగా గడుపుతామని, క్రీడలు జీవితంలో మానసిక ఒత్తిడిలను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారని, క్రీడాకారులు అందరిలో స్కిల్స్ టాలెంట్ బాగా ఉన్నాయన్నారు. ప్రతీ ఒక్క ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలి ఆకాంక్షించారు.ఈ క్రికెట్ మ్యాచ్ రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులు అయినా పోలీస్ సిబ్బంది చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్లు (అడ్మిన్) బస్వా రెడ్డి, రామ్ చందర్ రావ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు పీ శ్రీనివాస్, జే వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.