కార్పొరేషన్, జూలై 4 : భోజనప్రియు లూ.. మీరు హోటళ్లలో ఆరగిస్తున్నది నాణ్యమైన ఆహారమేనా..? లొట్టలేసుకొని మరీ తింటున్నది ఫ్రెష్ చికెనేనా..? అంటే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగరంలో విచ్చలవిడిగా వెలిసిన హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వడ్డిస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా నగరంలోని ఓ హోటల్లో అధికారులు కుళ్లిపోయిన చికెన్, పాచిపోయిన వెజ్‌వంటకాలు బయటపడడం నాణ్యతను తెరపైకి తెస్తున్నది.
శుక్రవారం కరీంనగర్‌లోని మల్కాపూర్ రోడ్డులోని రాజుగారి బిర్యానీ అడ్డా హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిన చికెన్, పాచిపోయిన ఆహార పదార్థాలు, ఎక్స్‌పెయిరీ అయిపోయిన ఐట మ్స్ పెద్ద మొత్తంలో బయటపడడం చూసి అవాక్కయ్యారు. కిచెన్‌తోపాటు ఫ్రీజర్‌లో చెడిపోయిన చికెన్‌ను గుర్తించి బయట పారేశారు.
చికెన్‌తోపాటు కార్న్, వెజ్ వంటకాలు కూడా పాడైపోయాయని, వాటిని కూడా తొ లగించారు. నిబంధనలకు విరుద్ధంగా కృత్రి మ రంగులు కూడా వాడుతున్నట్టు గుర్తించారు. మొత్తంగా ఈ తనిఖీల్లో సుమారుగా 17 కేజీల చికెన్, ఇతర ఆహార పదార్థ్థాలు గుర్తించామని కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్‌రెడ్డి తెలిపారు. నాన్‌వెజ్ ఐటమ్స్‌కి సంబంధించిన ముడి పదార్థాలపై తప్పకుండా డేట్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.