ఇల్లంతకుంట, నవంబర్ 25: కార్యకర్తలంద రూ సైనికుల్లా పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించా రు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో శుక్రవారం టీ(బీ)ఆర్ఎస్ మండల స్థాయి పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని గ్రామాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి, పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉం టుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, పార్టీ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సర్పంచు లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా కానుకలు అందిస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కందికట్కూర్, పొత్తూరు, రేపాక, వంతడుపుల, ముస్కానిపేట, తాళ్లపెల్లి, గాలిపెల్లి, జవారుపేట, కేశన్నపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఇటీవల అనారోగ్యం బారినపడి మృతిచెందిన కార్యకర్తల కుటుంబసభ్యులను పరామర్శించా రు. తర్వాత దళితబంధు లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించారు.
ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారె డ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ఎం పీపీ గుడిసె ఐలయ్య, రవీందర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచులు ముత్యం అమర్గౌడ్, సిద్ధం శ్రీనివాస్, ఎలుక లక్ష్మి, రోండ్ల లక్ష్మి, చింతలపెల్లి తిరుపతిరెడ్డి, చింతలపెల్లి శ్రీలత, మల్లుగారి వాణి, కట్ట వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు పట్నం అశ్విని, సావనపెల్లి వనజ, సింగిరెడ్డి శ్యామలాదేవి, జీపీ కార్యదర్శులు, నేత లు మీసరగండ్ల అనిల్, వెంకటరాంరెడ్డి, బాలరా జు, సాదుల్ తదితరులు ఉన్నారు.