Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 5: తంగళ్ళపల్లి మండలంలో సిరిసిల్ల- సిద్దిపేట రహదారిలోని బద్దెనపల్లి చౌరస్తా ఆర్అండ్ బీ అధికారులు స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డుకు ఏర్పాటు చేశారు. మార్చి 24 న ‘నమస్తే తెలంగాణ’లో ‘డేంజర్ చౌరస్తా @బద్దెనపల్లి’ అనే శీర్షికన కథనం ప్రచురించింది.
కాగా స్పందించిన అధికారులు బద్దెన పల్లి చౌరస్తా లో స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మండలంలో సిరిసిల్ల-సిద్దిపేట రహదారితో పాటు బద్దెనపల్లి నుంచి రామన్నపల్లె, బస్వాపూర్, రామోజీపేట మీదుగా ఇల్లంతకుంట వరకు వెళ్తుంటారు. మరోవైపు బద్దెనపల్లి చౌరస్తా నుంచి ఇందిరమ్మ కాలనీ, కెసిఆర్ నగర్ మీదుగా మండే పెళ్లి , రాళ్లపేట, కట్కూర్, గండి లచ్చపేట ముస్తాబాద్ మండలం వరకు నిత్యం భారీగా వాహనాలు వెళుతున్నాయి.
దీంతో బదనపల్లి చౌరస్తా ట్రాఫిక్ మరింత పెరిగింది. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో చౌరస్తాలో వాహనాలు అదుపుతప్పి, ఇతర కారణాలతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే స్థానికులు జంకుతున్నారు. అధికారులు స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం తో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తేతెలంగాణ’, అధికారులకు స్థానికులు కృతజ్ఞతులు తెలిపారు.