Maha Annadanalu | వీణవంక, ఆగస్టు 31 : వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారంప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానాలు చేశారు. వల్బాపూర్ గ్రామం శివాలయం, వీణవంకలో గౌడసంఘం ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, మహాన్నదానం చేశారు. వల్బాపూర్లో కాసాని ప్రశాంత్, బావు హరీష్, పోతరవేన సురేష్, వీణవంకలో తాళ్లపెల్లి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమాల్లో వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. నర్సింగాపూర్ గ్రామంలో విగ్నేశ్వర భక్తమండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులలో భాగంగా సుమారు 40 జంటలు అత్యంత పవిత్రంగా జరిగిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్బాపూర్ శివాలయ కమిటీ సభ్యులు,వీణవంకలో తాళ్ళపెల్లి కుమారస్వామి, నాగరాజు, శివ, సతీష్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, సాయి, మహస్త్రశ్, అనిల్, శంకర్, వర్షిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.