SP Ashok Kumar | సారంగాపూర్, జూన్ 13: గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని అన్నారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.
నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ0లో 5s అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు. 1993 సంవత్సరంలో సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతార, నేరెళ్ల మధ్యదారిలో రోడ్డు పై మావోయిస్టులు అమర్చిన మందు పాత్రర పేలి అమరుడైన కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు దత్తాద్రి, సదకర్, కుమారస్వామి, సుధీర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.