వేములవాడ, ఫిబ్రవరి 14: రాజన్న దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రానివ్వకుండా చూడాలని ట్రైనీ ఎస్పీ రాహుల్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆటో డ్రైవర్లు, యజమానులతో సమావేశమై, మా ట్లాడారు. రాజన్న సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ప్రధాన రహదారితోపాటు ఆలయ పరిసరాల్లో రద్దీ అధికంగా ఉంటుందని చెప్పారు. వాహనాలు, ఆటోల రాకపోకలతో భక్తులకు నడవడానికి కూడా ఇబ్బంది ఉండడంతో మహాశివరాత్రి జాతర వరకు ప్రధాన ఆలయం మీదుగా ఆటోలను అనుమతించబోమని చెప్పారు.
రెండు బైపా స్ రహదారుల మీదుగా ఆటోలను అనుమతించడంతో ప్రజలకు యథావిధిగా సౌకర్యాలు అందించాలని సూచించారు. జాతరలో చోరీలు ఎకువగా జరిగే అవకాశం ఉండడంతో, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనదారులు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆటోలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సీఐలు కరుణాకర్, శ్రీనివాస్, ఎస్ఐలు అంజయ్య, మారుతి, డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్షుడు దేవరాజు, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, లింగంయాదవ్, సాబీర్, మర్రిపల్లి రాజు, యూసుఫ్, జమిని, రాజు, తదితరులు పాల్గొన్నారు.