Rasamai balakishan | తిమ్మాపూర్,జూలై21: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం ఉదయం పలు గ్రామాల్లో కలియతిరిగారు. తిమ్మాపూర్ మండలంలోని వచ్చనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు, వృద్ధులు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలో చౌరస్తాలో ఉన్న ఓ వృద్ధురాలి వద్దకు ఆయన వెళ్లి పలకరించగా. ‘కొడుకా.. ఎన్నొద్దులకు కనబడుతివి.. నువ్వు లేక పల్లె చిన్నబోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మళ్ళీ మనదే రాజ్యం.. అవ్వ అంటూ ఆయన ముందుకు సాగారు. వృద్ధురాలు ఆప్యాయత చూసి గ్రామస్తులు, నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఏకనందం, ల్యాగాల వీరారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ ఉమారాణి, వడ్లూరి శంకర్, మాతంగి లక్ష్మణ్, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఎలుక ఆంజనేయులు, అందే సంతోష్, శంకర్, సది తదితరులు పాల్గొన్నారు.