Someswara Swamy | మల్లాపూర్, ఆగస్టు 11: మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ శ్రావణమాసంలో భక్తులు ఐదు సోమవారం భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కి సహజ సిద్ధమైన కోనేరులో పుణ్యస్నానాలను ఆచరించి కొండపైన కోలువుదీరిన శ్రీ కనక సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం అనావాయితీ. ఇలా చేస్తే భక్తులు కోరుకున్న కోరికలు నేరవేరుతాయని నమ్మకం.
అలాగే సోమేశ్వరస్వామికి ప్రీతికరమైన వరదపాశం (బెల్లం అన్నం)ను ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యాము వండి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆలయ ఆవరణలో ప్రధాన అర్చకులు బల్యపల్లి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి వరదపాశంను పోసి భక్తు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. అలాగే గ్రామానికి చెందిన గోపిడి రమేష్ రెడ్డి-లత దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం, ఉపాద్యక్షుడు ఇల్లెందుల తుక్కారం, కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.