Ellandakunta | ఇల్లందకుంట, ఏప్రిల్ 7: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ భాగంగా పట్టాభిషేకం కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ పట్టాభిషేకం కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పట్టాభిషేకాన్ని తిలకించారు. పట్టాభిషేకానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో కందుల సుధాకర్, అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధర్, ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు