రాజన్న సిరిసిల్ల, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గం కొ లువు దీరింది. 12 మంది డైరెక్టర్లంతా సోమవా రం బ్యాంకు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి బాధ్యతలు చేపట్టగా, వా రిని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కళ మాట్లాడుతూ, సహకార రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న అర్బన్ బ్యాంకుకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ, ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని పాలకవర్గానికి సూ చించారు.
ప్రజలు తమపై ఉంచిన బాధ్యతలను తూచ తప్పకుండా నెరవేరుస్తామని, మెరుగైన సేవలందించి, బ్యాంకు అభివృద్ధి చేస్తామని నూ తన చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ అన్నారు. పా లకవర్గ సభ్యులందరం ఖాతాదారులకు సేవలందిస్తూనే బ్యాంకును జాతీయ బ్యాంకులకు ధీటు గా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రాంమోహన్, బ్యాంకు పాలకవర్గ సభ్యులు పత్తిపాక సురేశ్, కోడం సం జీవ్, హర్షిణి, సుక్కవ్వ, రాజు, పాటికుమార్రా జు, గుడ్ల సత్యానందం, అడ్డగట్ల దేవదాస్, చొప్పదండి ప్రమోద్, ఎనగందుల శంకర్ పాల్గొన్నారు.