Mulkanoor | చిగురుమామిడి, సెప్టెంబర్ 7 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీ ఎంఎస్) ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ ప్రతిష్టాత్మక ‘శిక్షా రత్న అవార్డు-2026’ను అందుకున్నారు. హైదరాబాద్‌లోని కాన్హా శాంతి వనంలో ఈనెల 6 న ‘సూపర్ ఏఐ ఫౌండేషన్’, ‘హరి యూనివర్సిటీ’, ‘స్టడీ 9 మీడియా’ సంయుక్తంగా నిర్వహించినకార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
విద్యారంగంలో హర్షిత్ కౌర్ కనబరిచిన అంకితభావం, సేవలు ప్రతిభను గుర్తించి ప్రిన్సిపాల్‌ను సత్కరించారు. సూపర్ ఏఐ ఫౌండేషన్ ఫౌండర్ నిఖీలు గుండా, హరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మల్గిరెడ్డి నర్సిరెడ్డి, స్టడీ 9 మీడియా ఫౌండర్ చేతుల మీదుగా హర్జీత్ కౌర్ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మండలంలోని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.