Telangana Jagruti UAE | మాల్యాల, జూన్ 29: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు ఆరె శేఖర్ గౌడ్ తెలంగాణ జాగృతి యూఏఈ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన ప్రస్తుతం యూఏఈ లో ఉంటున్న అనేకమంది గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ద్వారా సేవలాందిస్తూ, ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కాగా ఆయన సేవలను గుర్తించి తెలంగాణ జాగృతి యూఏఈ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి గార్లు నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన శేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ జాగృతి యూఏఈ ప్రధాన కార్యదర్శిగా నియమించిన కవిత, నవీన్ ఆచారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.