Crime | ధర్మపురి, జూలై 8 : ధర్మపురి మండలానికి చెందిన ఓ 20ఏళ్ల యువతిపై మండలంలోని గాదెపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగికదాడి చేసి, నగ్నంగా ఉన్న యువతిని వీడియోలు తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి గ్రామస్తులు, కుటుంబసభ్యులు, పోలీసులు కథనం ప్రకారం.. బాధిత యువతి తల్లికి ఓ చిన్న పత్రికలో విలేకరిగా పనిచేసే వ్యక్తితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంలో భాగంగా తన కూతురు పదోతరగది వరకు చదివి ఇంటివద్దనే ఉంటున్నదని, ఉన్నత చదువులు చదివించాలనే కోరిక ఉందని అతడికి తెలిపింది. ఉన్నత చదువులకు సహకరిస్తానని ఆ ప్రబుద్ధుడు నమ్మబలికాడు.
ఉన్నత చదువులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటాయని చెప్పగా తల్లి తన కూతురును వెంట తీసుకొని ఈ నెల 3న ధర్మపురికి వచ్చింది. అయితే అతడికి ఫోన్ చేయడంతో సర్టిఫికేట్లు తను తీసుకువస్తానని చెప్పి దరఖాస్తు ఫామ్స్ తీసుకొని వీరిని గోదావరి ఒడ్డున గల ఓ కల్యాణమండపం గదిలో ఉంచాడు. కొద్ది సేపటికి నిందితుడు బీర్లు, కూల్ డ్రింక్స్, బిర్యాని ప్యాకెట్లు తీసుకొని తల్లీకూతుర్లు ఉన్న గదికి వచ్చాడు. ముగ్గురూ బిర్యాని తింటూ మద్యం, కూల్ డ్రింక్స్ సేవించారు. అయితే పథకం ప్రకారం తల్లీకూతుర్లు తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. బిర్యాని తిని డ్రింక్ తాగిన తల్లీబిడ్డలు గాఢ నిద్రలోకి జారుకున్నారు.
ఇదే అదునుగా భావించి నిద్రలో ఉన్న తల్లిని పక్కకు తోసేసి, అతడు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం నగ్నంగా ఉన్న యువతిని సెల్ఫోన్లో వీడియోలు తీశాడు. సాయంత్రం వరకు మత్తుదిగిన తల్లీబిడ్డలు గ్రామానికి చేరుకున్నారు. అయితే యువతిని నగ్నంగా తీసిన వీడియోలను నిందితుడు తన స్నేహితుడికి కి వాట్సాప్ చేశాడు.
ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారడంతో గుర్తించిన యువతి తన తల్లితో కలిసి ధర్మపురి పోలీసులను ఆశ్రయించింది. యువతిని వైద్యపరీక్షలు పంపి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. కాగా సదరు ప్రబుద్ధుడిని అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి (ధర్మపురి కాదు) పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.