Jagityal | జగిత్యాల టౌన్ : సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సినిమా కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘నువ్వా నేనా’ అనే టైటిల్ తో డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డాన్సర్లు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎన్డీఎస్ డాన్స్ అకాడమీ నుంచి మౌళి ఠాకూర్ సీనియర్ సోలో వెస్టర్న్ క్యాటగిరిలో పాల్గొని ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలికకు మెమొంటోను, నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఫేమస్ సినిమా కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, నగేష్, కృష్ణ జగిత్యాలకు చెందిన ఎండీఎస్ డాన్స్ అకాడమీ మాస్టర్లు మణిదీప్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.