Quiz Competitions | కాల్వ శ్రీరాంపూర్, ఆగస్టు 30 : కాల్వశ్రీరాంపూర్ మండల స్థాయి గణిత, సైన్స్ క్విజ్ క్లబ్ టాలెంట్ టెస్టును మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో పీ సాయి శివాని, కే నిశాంత్ ప్రథమ, ఎలిమెంటరీ స్థాయి నుండి పీ సాత్విక్, పీ సాయి కృతిక లు ప్రథమ స్థానం సాధించారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈవో మహేష్, అభినందించి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సునీత, ఉపాధ్యాయ సిబ్బంది జయప్రకాష్, సంతోష్ కుమార్, గణిత సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.