Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, జూన్ 11 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో సర్పంచ్ పోశాల శైలజ సదానందం ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేముల ప్రవీణ్ కుమార్, హెచ్ఎం లు మాధవి, శ్రీనివాస్, వార్డ్ సభ్యులు పూల్లూరి అన్విత-సాగర్, బొంగోని సరిత- శశికుమార్, ఉల్లి రాజమణి-రమేష్, గోర్రె సుమలత-ఉదయ్, గోపు హేమలత-కోమురయ్య, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.