chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 26: ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈవో) పావని అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో బడి బయట పిల్లల సర్వేలో భాగంగా శ్రీ సాయి క్లే బ్రిక్స్, మణికంఠ ఫ్లైయుష్ బ్రిక్స్, శాతవాహన ఫీడ్ ప్లాంట్లను కాంప్లెక్స్ ను బుధవారం సందర్శించారు.
ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీలలో పనిచేయుటకు వచ్చిన తల్లిదండ్రులతో, బట్టి యజమానులతో మాట్లాడారు. 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను ప్రాథమిక పాఠశాలలకు పంపించాలన్నారు. వారి పిల్లలకు రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. వీరి వెంట కాంప్లెక్స్ హెచ్ఎం మహమ్మద్ ఇర్షాద్, ఉపాధ్యాయులు తిరుపతయ్య, శ్రీనివాస్, రాజు రెడ్డి, ఐఈఆర్ పి తిరుపతి, సిఆర్పిలు బెజ్జంకి ఆంజనేయులు, శ్రీనివాస్,వెంకటేశం పాల్గొన్నారు.