SBI | తిమ్మాపూర్,జులై28: పేరుకు ఎస్బీఐ బ్యాంకు.. కానీ అక్కడికి పోవాలంటే ఖాతాదారుకు భయం అవుతోంది. బ్యాంకు సేవలు దేవుడెరుగు.. బయట పడితే చాలు అన్నచందంగా మారింది బ్యాంకు భవనం. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన క్వార్టర్స్ లో గత 20 ఏళ్ల నుండి బ్యాంకు నడుస్తున్నది.
అయితే సరైన మరమత్తులు, నిర్వహణ లేక అస్తవ్యస్తంగా తయారైంది. బ్యాంకు చుట్టూ గడ్డి పెరిగిపోతున్నది. పిచ్చి గడ్డి తీగలు భవనం పైకి తీగల పారుతున్న పట్టించుకునేవారు లేరు. బ్యాంకు లోపల లీక్ అయిన నీటితో గోడలు నాచు పట్టి అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల బ్యాంకు బయట ఖాతాదారులు కూర్చునే దగ్గరకు పాములు వచ్చాయని, లోపల తేలు కనిపించాయని ఖాతాదారులు వాపోతున్నారు.