Nustulapur | తిమ్మాపూర్,ఫిబ్రవరి17: ఆపద సమయంలో పొదుపు సంఘాల బీమా సభ్యులకు కుటుంబాలకు అండగా నిలుస్తుందని పురుషుల పొదుపు సంఘం బాధ్యులు పేర్కొన్నారు. నుస్తులాపూర్ గ్రామంలో శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘంలో సభ్యుడు మోతుకూరి రవీందర్ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించారు.
సంఘం ద్వారా మంజూరైన బీమా రూ.రెండు లక్షలను సమితి అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, సంఘ అధ్యక్షుడు కొంటు రవీందర్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. పొదుపు సంఘంలో సభ్యులుగా చేరితే కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మాచర్ల ఎల్లయ్య, పాలకవర్గ సభ్యులు దేవసాని సంపత్, గుండోజు బాలరాజు, వంగాల శ్రీనివాస్ రెడ్డి, దొంత కళ్యాణ్, ఘనకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.