APFC device | ముకరంపుర, జూలై 8 : ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్(ఏపీఎఫ్సీ) పరికరంతో విద్యుత్ ఆదా కావడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేష్ కుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం హెచ్టీ వినియోగదారుల తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
ఆటో మేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ పరికరం ఆవశ్యకతను వివరించారు. పవర్ ఫ్యాక్టర్ మెరుగ్గా ఉండడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గి, తక్కువ బిల్లు వస్తుందని చెప్పారు. పరికరాల జీవిత కాలం పెరుగుతుందని, వోల్టేజ్ స్టెబిలిటీతో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని, లైన్ లాస్ తగ్గడంతో పాటు అనేక రకాలుగా లాభం జరుగుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో డీఈలు ఉపేందర్, రాజం, లక్ష్మారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు శ్రీనివాసరెడ్డి, సుధీర్, శ్రీనివాస్, వినియోగదారులు పాల్గొన్నారు.