అభివృద్ధి, పరిశుభ్రతపై ఇప్పటికే పలు రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న పర్లపల్లి గ్రామం తాజాగా, మరోరాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వేస్ట్, లిక్విడ్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాలతోపాటు పచ్చదనం పరిశుభ్రత విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది.
సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా సర్పంచ్ మాదాడి భారతీదేవి ఈ అవార్డు అందుకున్నారు.
– తిమ్మాపూర్, జూన్ 5