Jagityal | జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో వార్డ్ కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో వార్డులోని ప్రజలకు ఉచిత మొక్కలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో వార్డు ప్రజలు విశేషంగా స్పందించారని తెలిపారు.
కాగా పెద్ద ఎత్తున యువతులు, మహిళలు, స్వయం సహాయక సంఘాల (SHG) ప్రతినిధులు తరలివచ్చి వివిధ రకాల మొక్కలను స్వీకరించారని, వార్డులో ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, నాటిన మొక్కలను సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని కోరారు.