కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏప్రిల్ 16 : తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నగరానికి చెందిన సముద్రాల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . 2018 నుంచి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న సముద్రాల అజయ్ సంఘాన్ని బలోపేతం చేయడానికి చేసిన కృషిని గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, తన మీద నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతంకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.