BRS | తిమ్మాపూర్,ఏప్రిల్19: సమ్మక్క సారలమ్మ జాతరను తలపించేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉండనున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మండల ముఖ్య నాయకులతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. మానకొండూర్ నియోజకవర్గం నుండి 10 వేలు , తిమ్మాపూర్ మండలం నుంచి 2 వేలు మందిని తరలిస్తామని చెప్పారు. మొదటగా ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోవడం లేదన్నారు.
తమ నాయకుడు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నాని, బీఆర్ఎస్ అంటేనే కరీంనగర్ అని, మొదటి సభ కరీంనగర్లోనే నిర్వహించిన అనుబంధం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, మాతంగి లక్ష్మణ్, పాశం అశోక్ రెడ్డి, అనబేరి రాధాకిషన్ రావు, సంగుపట్ల మల్లేశం, బోయిని కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.