19
Saddula Bathukamma | ఓదెల, సెప్టెంబర్ 29: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా దేవాలయాలు, పాఠశాలలు, వాడవాడల, చెరువు సమీపంలోని ఆట స్థలాల వద్ద, రోడ్ల వెంబడి రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు కలర్ పేపర్లతో శోభాయ మానంగా తీర్చిదిద్దారు.
మహిళలు కోలాటాలతో ఈసారి బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగను మహిళలు తిరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆట, పాటలతో పూజించడం జరిగింది. చేనులో దొరికే గునుగు పూలు, తంగేడు, పట్టు కుచ్చులు, గుమ్మడిపూలు, బంతిపూలు, కట్ల పూలు ఇలా తీరక పూలతో బతుకమ్మలను అలంకరించారు. పలు గ్రామాల్లో డిజె సాంగ్స్ పెట్టుకొని మహిళలు బతుకమ్మను పాటలతో కోలాలతో నృత్యాలు చేశారు. ఉల్లాసంగా… ఉత్సాహంగా బతుకమ్మ ఆటలను వృద్ధులు, చిన్నారులు సైతం ఆడారు.