Sabbitham | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 17: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంకిడి శ్రీనివాస్ అనారోగ్యంతో బారిన పడి దవఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సబ్బితం గ్రామానికి శ్రీనివాస్ రెండుపర్యాయాలు దశాబ్దకాలం పాటు సర్పంచ్ గా పనిచేసి ప్రజా సేవలు అందించారు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు వివిధ పార్టీల నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.