Mallapur | మల్లాపూర్‌లో జర్నలిస్టుపై అధికార పార్టీనాయకుడి అసభ్యపదజాలం
మల్లాపూర్ మండల సీనియర్ జర్నలిస్ట్ రుద్ర రాంప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్ల రాజన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ అన్నారు.
- మాజీ ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని టీయూడబ్యూజే(హెచ్-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంగోపాల్ డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన, వినతిపత్రం అందజేత
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 19 : మల్లాపూర్ మండల సీనియర్ జర్నలిస్ట్ రుద్ర రాంప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్ల రాజన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ అన్నారు. శనివారం యూనియన్ల అతీతంగా జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులపై అధికార పార్టీ అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, చేసిన వ్యాఖ్యలకు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సదరు నేతను వెంటనే సస్పెండ్ చేయాలని, లేకుంటే జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్యతో ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాంచందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అంజుగౌడ్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు అలాల శంకర్, షౌకత్ అలీ, జిల్లా ఉపాధ్యక్షుడు కనుక సంజీవ్, ఐజేయూ ఈసీ సభ్యుడు చింతలూరి రంజిత్, జర్నలిస్టులు సుతారి కృష్ణమాచారి, తోకల పవన్, ముత్యాల రమేష్, మోర సతీష్, నూనె అంజనేయులు, పెంబి మహేష్, ఆదరి రాజేందర్, రమేష్ నాయక్, శేఖర్, శ్రీనివాస్, మల్లేష్, వెంకటేష్, సుధాకర్, మహేష్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

