Amit Shah | కర్ణాటకలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అస్వస్థత..!
Amit Shah | కర్ణాటక (Karnataka) లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) శనివారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో హుబ్బళ్లి (Hubballi) లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన హోటల్‌కే పరిమితమయ్యారు.
Amit Shah : కర్ణాటక (Karnataka) లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) శనివారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో హుబ్బళ్లి (Hubballi) లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన హోటల్‌కే పరిమితమయ్యారు. అరోగ్యంగా ఉంటే హుబ్బళ్లిలోని కేఎల్ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసవిర్మఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రిసెర్చ్ సెంటర్‌ను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది.
రూ.700 కోట్ల వ్యయంతో ఈ మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమం నిమిత్తం షెడ్యూల్ ప్రకారమే శుక్రవారం రాత్రి అమిత్ షా హుబ్బళ్లి చేరుకుని ఒక హోటల్లో బస చేశారు. అయితే శనివారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అమిత్ షా గైర్హాజరీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అనారోగ్య కారణాలవల్లే అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని కేఎల్ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

