Roads damaged | రాయికల్, సెప్టెంబర్ 3 : ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాయికల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్థానిక నాయకులతో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మూటపల్లి- కొత్తపేట దెబ్బతిన్న వంతెనలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న అనుసంధాన వంతెనలకు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. దెబ్బతిన్న వంతెనలు రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత శాఖ అధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాలను, విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్, మండల కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మహేశ్వర రావు, నాయకులు శ్రీనివాస్, ప్రశాంతరావు, గంగారం, లక్ష్మణ్, తిరుపతి, జంగారెడ్డి, ప్రవీణ్, చిన్న, బుచ్చన్న, రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.