Godavarikhani | గోదావరిఖని ఎల్బీ నగర్లో రోడ్డు ఆక్రమణలు.. రోజుల తరబడి వాహనాల పార్కింగ్
రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ పరిధి ఎల్బీ నగర్ నుంచి సింగరేణి స్టేడియం వరకు నిర్మించిన నూతన రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ విపరీతంగా ఉండటంతో ఇటీవలనే ఎల్బీ నగర్ నుంచి పరశురాంనగర్ వరకు రూ.లక్షల నిధులు వెచ్చించి రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్ల ముందు బాగాలను కూల్చివేసి రెండు వైపులా సిమెంట్ రోడ్డును నిర్మించారు.
- వినియోగంలోకి రాని రోడ్డు వెడల్పు
- మట్టి కుప్పలు, కంకర తొలగించని కాంట్రాక్టర్
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 30 : రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ పరిధి ఎల్బీ నగర్ నుంచి సింగరేణి స్టేడియం వరకు నిర్మించిన నూతన రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ విపరీతంగా ఉండటంతో ఇటీవలనే ఎల్బీ నగర్ నుంచి పరశురాంనగర్ వరకు రూ.లక్షల నిధులు వెచ్చించి రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్ల ముందు బాగాలను కూల్చివేసి రెండు వైపులా సిమెంట్ రోడ్డును నిర్మించారు. స్థానికులకు కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే నిర్మించిన కొత్త రోడ్డు వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణకు గురవుతుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వినియోగించుకోలేని పరిస్థితి ఉండడంతో పూర్వపు ఉన్న సింగిల్ రోడ్డుపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ఎందుకంటే రెండు వైపుల నిర్మించిన సిమెంట్ రోడ్డు కార్లు, ప్రైవేటు ట్రావెల్ బస్సులు, ఇతర వాహనాల పార్కింగ్‌లకు అడ్డాగా మారిపోయింది. కొత్త రోడ్డు నిర్మించినప్పటి నుంచి రోడ్డును ఆక్రమించుకొని రోజుల తరబడి వాహనాలు పార్కింగ్ చేసి ఉంచడంతో ఎప్పటిలాగే ఇబ్బందులు తప్పడం లేదు. అంతేగాక కొన్ని చోట్ల రోడ్డు నిర్మాణం సమయంలో పోసిన మట్టి, కంకర కుప్పలను కూడా కాంట్రాక్టర్ తొలగించలేదు. ఆ కారణంగా కూడా రోడ్డును వినియోగించుకోలేని దుస్థితి ఉంది. రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేసిన అధికారులు ఆ రోడ్డును వినియోగంలోకి తీసుకరావడంను పట్టించుకోలేదు.
రూ.లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కేవలం వాహనాల పార్కింగ్ కోసమేన ? అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కనీసం మట్టి కుప్పలైనా తొలగించడం లేదని వాపోతున్నారు. విశాలంగా నిర్మించిన రోడ్డు ఆక్రమణలతో నిష్ప్రయోజనంగా మారిపోతుంది. రూ. ఖర్చు చేసిన రూ.లక్షల నిధులు రోడ్డు పాలేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని రోడ్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకరావాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

