వేములవాడ, నవంబర్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడకు వచ్చారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 76కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా, స్వామివారి ధర్మగుండం వద్ద ఈశాన్య ప్రాంతంలో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిషరించారు. ఆలయ ఆవరణలో స్వామివారి ఆలయ అభివృద్ధి చాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అకడి నుంచి రాజన్న ఆలయానికి చేరుకోగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కోడెమొకు చెల్లించుకుని స్వామివారి అనుబంధ ఆలయాలైన బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయ రమణారావు, మకాన్ సింగ్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ రాజన్న తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం గుడిచెరువులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభా స్థలానికి చేరుకొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వేదికపై ప్రసంగించి, తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.