Nomination | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 4 : రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి ఉప్పు లక్ష్మీ సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి లక్ష్మి మంచారామీ గ్రామ సర్పంచ్ గా ఉప్పు లక్ష్మీ నామినేషన్ వేసేందుకు గ్రామస్తులతో కలిసి కాలినడకన కనుకులకు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
అంతకు ముందు ఉప్పు లక్ష్మి తన అత్తగారి ఆశీర్వాదం తీసుకొని గ్రామస్తులతో కలిసి భారీ సంఖ్యలో రాలీగా నామినేషన్ కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో తిరిగిన అనుభవం ఉందని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాతావరణం గ్రామాల అభివృద్ధి చూసి సొంత గ్రామం కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో సర్పంచ్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.