Medical camp | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 8: దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కొంత మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ ఉండగా ఏడుగురు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి గురువారం తరలివచ్చారు. దీంతో ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేయడంతో గురుకులంలో ఫీవర్ కలకలం పేరిట నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం మైంది. దీంతో కాగా అధికారులు స్పందించారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో వైద్యాధికారి సారియా అంజుమ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలిరావడంతో పాఠశాల ఆవరణ కిటకిటలాడింది. 63 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందించారు. ఇందులో నల్గురు విద్యార్థుల బ్లడ్ షాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. సీజనల్‌గా వచ్చిన వైరల్ జ్వరాలేనని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యాధికారి సారియా అంజుమ్ తెలిపారు. ఇక్కడ సూపర్వైజర్ ఎన్. పద్మజ, ఎమ్ ఎల్ హెచ్ పి శిల్ప, హెల్త్ అసిస్టెంట్ బాబు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.