Double road work | గన్నేరువరం, అక్టోబర్ 23 : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్ మోహన్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని మల్లయ్య కోరారు. గన్నేరువరం పర్యటనకు ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పుల్లెల జగన్ మోహన్ మాట్లాడుతూ డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రయాణం కష్టంగా మారిందని, గన్నేరువరం నుండి పొత్తుర్ వరకు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయాలని కోరినట్లు తెలిపారు.