Kolanur | ఓదెల, నవంబర్ 26 : దక్షిణ మధ్య రైల్వే లోని కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ సెక్షన్ లోని కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులకు బుధవారం వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని చీఫ్ ప్రిన్సిపల్ ఆపరేటింగ్ మేనేజర్ పద్మజ ను కలిసి రైళ్ల హాల్టింకు విన్నవించారు. కొలనూరు స్టేషన్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 మండలాలకు ముఖ్య కూడలిగా ఉండి ప్రజలకు రైల్వే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు.
కొలనూరు పరిసర గ్రామాలైన దాదాపు 30 గ్రామాల ప్రజలు, నాలుగు మండలాలకు చెందినవారు ఇక్కడి నుంచి రైళ్ల ప్రయాణానికి రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా కొలనూరు స్టేషన్లో తిరుపతి, అజిని, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరారు. ఈ విషయంలో రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కొలనురు స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపించాలని విన్నవించారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్(జీన్స్), డిసిసి ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచ్ సామ ఢిల్లీ శంకర్, ఉస్మానియా జేఏసీ నాయకుడు జక్కుల మధు యాదవ్, రామగుండం మాజీ కార్పొరేటర్ జన్ను మధు తదితరులు పాల్గొన్నారు.