Kolanur | ఓదెల, జులై 24 : కొలనూర్ రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని మూడు గ్రామాల ప్రజలు శుక్రవారం రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణనకు వినతి పత్రాన్ని అందజేశారు. కొలనూరులో రైల్వే డ్రైవర్ల రెస్ట్ రూమ్ ప్రారంభించడానికి డీఆర్ఎం రాగా మూడు గ్రామాల సర్పంచులు ప్రజలు కలిసి రైళ్లను ఆపాల్సిన ప్రాధాన్యతను వివరించారు. సానుకూలంగా స్పందించి ఎక్స్ప్రెస్ రైలు కాగజ్నగర్, అజ్నిలను ఆపించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు పల్లె కనకయ్య, గ్యారవేణి విజయ-నాగరాజ్, ఉప సర్పంచులు పాకాల సంపత్ రెడ్డి, మాటూరి మహేందర్, నాయకులు బైరి రవి గౌడ్ ఢిల్లీ శంకర్, బొంగోని రాజయ్య గౌడ్, గుండేటి ఐలయ్య, పాకాల కర్ణాకర్ రెడ్డి, కొల్లూరి చందు, మాటూరి రత్నం, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.