Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్ 28 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి మరమ్మత్తులు, వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ, గ్రంథాలయం ఏర్పాటు సమస్యలను పరిష్కరించాలని వారు వినతిపత్రం అందజేశారు.
అలాగే గ్రామాభివృద్ధికి అన్ని విధాల మిలీనియం అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారి రవికుమార్, ఉపాధ్యక్షుడు గందె చిరంజీవి, కార్యదర్శి పరిపాటి మహిపాల్ రెడ్డి, కోశాధికారి లంకసిరి శ్రీనివాస్, సభ్యులు అప్పాల రమేష్, కట్కుజ్వల ప్రశాంత్ చారి, భాషబత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.