May Day | చిగురుమామిడి, మే 1: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని మండలంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కార్మికులు, తాపీ, మేస్త్రి హమాలీలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి మేడే జెండాను ఎగరవేశారు. చిగురుమామిడి, రేకొండ, సీతారాంపూర్, ఓగు లాపూర్, రామంచ, ముల్కనూర్, లంబాడి పల్లె, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో కార్మికులు జెండాలు ఎగరవేశారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి అందే స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యురాలు గూడెం లక్ష్మి మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రపంచంలోని కార్మికులంతా తమ హక్కుల సాధన కోసం, మేడే ను ఆసాధన దిశగా జరుపుకోవడం కోసం మేడే అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సిపిఐ నాయకులు ముద్రకోల రాజయ్య, తేరాల సత్యనారాయణ, దుడ్డేల సమ్మయ్య, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.