గంగాధర, మార్చి 21: ఈనెల 23వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని(BRS meeting) విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బూరుగుపల్లిలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గంగాధర మండలంలోని ప్రతి గ్రామంలో నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు సాగి మహిపాల్ రావు, కంకణాల విజేందర్ రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, వేముల దామోదర్, రామిరెడ్డి సురేందర్, ఎండీ నజీర్, ఆకుల మధుసూదన్, దూలం శంకర్ గౌడ్, శ్రీమల్ల మేఘరాజు, కర్ర శ్రీనివాస్ రెడ్డి, తోట మహిపాల్, జోగు లక్ష్మీరాజం, తడిగొప్పుల రమేష్, ముక్కెర మల్లేశం, వడ్లూరి ఆదిమల్లు, పొట్టల కనకయ్య గడ్డం స్వామి, ఇరుగురాల రవి, జలంధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.