Madhusudana Chari | తిమ్మాపూర్, ఆగస్టు9: మండల వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి ఆడబిడ్డలు తల్లి గారి ఇంటికి వచ్చి సోదరులకు రాఖీ కట్టి దీవించారు.
కరీంనగర్ పర్యటనకు వచ్చిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మహాత్మానగర్ లోని మాజీ జడ్పీటీసీ ఉల్లంగుల పద్మ ఏకానందం ఇంటికి రాగా ఆమె రాఖీ కట్టి హారతి పట్టారు. అలాగే పలువురు ప్రముఖులు వారి సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వదించారు.