కార్మిక క్షేత్రంలో హరిత బడ్జెట్ హోటల్
: కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్యుకేషన్ హబ్‌లా మారింది. ఎన్నో విద్యాసంస్థలు వచ్చాయి.
- మంత్రి కేటీఆర్ చొరవ
- సిరిసిల్లలో 18కోట్లతో నిర్మాణం
- ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం
రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగా ణ) : కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్యుకేషన్ హబ్‌లా మారింది. ఎన్నో విద్యాసంస్థలు వచ్చాయి. స్థానిక యువతతోపాటు ఇతర జిల్లా ల విద్యార్థులు ఇక్కడ విద్యభ్యాసం చేస్తుండడం కనిపిస్తున్నది. వైద్యరంగంలోనూ కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన సేవలందుతున్నాయి. ఉపాధి పరంగా ఎన్నో అవకాశాలు పెరిగాయి. వస్త్ర పరిశ్రమ కూడా జీవం పోసుకున్నది. అయితే వివి ధ పనుల కోసం వచ్చే సిరిసిల్లకు వచ్చే ప్రజలు, అధికారులు, వస్త్ర పరిశ్రమ కోసం వచ్చే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, అలాగే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మరోవైపు రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఈ ప్రాంతంలో మంచి సౌకర్యాలతో కూడిన హోటళ్లు లేవు. అయితే ఈప్రాంతంలో మంచి హోటల్ ఉండాలన్న ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని సిరిసిల్ల పట్టణానికి హరిత బడ్జెట్ హోటల్‌ను మంజూరు చేయించారు. కార్మిక క్షేత్రం కాబట్టి తక్కువ బడ్జెట్లో సౌకర్యాలు లభించే లా 18కోట్లతో హోటల్ నిర్మిస్తున్నారు.రెండో బైపాస్‌రోడ్డులోని పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీకి ఎదురుగా రెండెకరాల స్థలం కేటాయించారు. జీప్లస్ వన్‌తో మొత్తం 26 గదులు నిర్మిస్తున్నారు. అందులో వీఐపీల కోసం రెండు ఏసీ సూట్లు, కాన్ఫరెన్స్ హాలు, 500మంది కూర్చుండేలా బంకెట్ హాల్, 50 మంది కూర్చుండి అల్పాహారం, భోజనం చేసేందుకు వీలుగా రెస్టారెంట్ నిర్మిస్తున్నారు. కార్మిక, ధార్మికక్షేత్రాలకు వచ్చే టూరిస్టులకోసం ప్రత్యేకంగా ఐన్ హౌస్బార్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బయటి రేట్ల కన్నా తక్కువ ధరలతో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
నిర్మాణ పనులు వేగవంతం
హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణాన్ని పర్యాటక శాఖ వేగవంతం చేసింది. వచ్చే ఆగస్టు 15తేదీ వరకు అందుబాటులోకి తేచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. జీప్లస్ వన్ అంతస్తుతో నిర్మిస్తున్న హోటల్ పని శ్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. మెట్ల నిర్మాణం పూర్తయింది. ఏసీ, నాన్ ఏసీ గదులన్నీ అధునాతన డిజైన్లతో రూపొందించేలా నిర్మాణం జరుగుతున్నది. అన్ని హంగులతో స్టార్ హోటల్ తరహాలో అద్భుతంగా నిర్మిస్తున్న ఈ హోటల్ అందుబాటులోకి వస్తే టూరిస్టులు, పారిశ్రామిక వేత్తలకు మంచి సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కోసం 20 గుంటల స్థలాన్ని కేటాయించారు. రెస్టారెంట్ పక్కనే లాడ్జి గదులు నిర్మిస్తున్నారు. అప్పారెల్ పార్క్, వర్కర్ టూ ఓనర్, మెడికల్ కాలేజీ, 17వ పోలీస్ బెటాలియన్, రెండు వందల పకడల దవాఖాన, జేఎన్టీయూ కళాశాలలతో ఈ రెండో బైపాస్‌రోడ్డు భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందే అవకాశాలుండగా, హరిత బడ్జెట్ హోటల్‌ను ఇక్కడ నిర్మించడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

