KTR | అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. షబ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు : కేటీఆర్
KTR | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
KTR | కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది.. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు.
ఆనాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిరూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకుంటురని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నడు కాబట్టే రాహుల్ గాంధీ కూడా ఏమీ చేయలేని అసక్తతలో ఉన్నడని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్ ఆమె నిజాయితీగా ఉంటే రేవంత్ రెడ్డితో పాపం ఆమెకు ఏదో పంచాయతీ పడ్డది. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టకు ఇది మంచి పద్దతి కాదు… హైడ్రా, మూసీ పేరు మీద గరీబోళ్ల ఇండ్లను నాశనం చేస్తున్నవ్ పార్టీకి చెడ్డపేరొస్తున్నదంటే ఆమెపై పగపట్టిండు.. మోఖా కోసం చూసి బీజేపీ పార్టీవాళ్లకు ఉప్పందించిండు. మీనాక్ష నటరాజన్ నామినేషన్ కూడా ఎగురగొట్టిర్రు. ఆమె మీద దొంగ కేసు పెట్టి.. నామినేషన్ ఎగరగొట్టేట్లు చేసిండు. సొంతపార్టీ వాళ్లకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తడా అని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు అని షబ్బీర్ అలీ చెప్పింది నిజం
ఆరోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడు
రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె… https://t.co/P33yPP6zYZ pic.twitter.com/FpIPwKTSxs
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Aashirwad: 87 బంతుల్లో 103 రన్స్.. రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ సోదరుడు
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

