సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 29 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామ సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి నిలబెట్టుకున్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఎవరైనా మృతి చెందిన వారి కుటుంబానికి అంత్యక్రియల కోసం రూ.5 వేలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో జూపల్లి ఎల్లవ్వ అనే వృద్ధురాలు మృతి చెందగా, వారికి రూ.5 వేలు రూపాయలను సర్పంచ్ జ్యోతి అందజేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందజేశారు. త్వరలోనే గ్రామంలో రూ.5 కే మినరల్ వాటర్ బబుల్ గ్రామస్తులకు అందించేందుకు ఎన్నికల హామీలో భాగంగా శ్రీకారం చుట్టుడుతామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నూతన సర్పంచ్ దంపతులను పలువురు అభినందించారు.