Rajanna Siricilla : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి

కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన సమీకృత కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, మండల వ్యవసాయాధికారులతో యాసంగి – 2021కు సంబంధించి పంట మార్పిడి, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పప్పుదినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే లాభాల గురించి వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయాధికారి రణధీర్కుమార్రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి జ్యోతి, పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

