సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 24: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి (Kadari Satyanarayana Reddy) అలియాస్ కోసా అలియాస్ సాదు మృతదేహాన్ని చత్తీస్‌గఢ్ పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈనెల 22వ తేదీన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ఇలాకలోని మూస్ఫర్షి ఆడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో సత్యనారాయణరెడ్డి మృతి చెందారు. ఆయన మరణవార్త తెలియగానే 23వ తేదీన సోదరుడు కరుణకార్ రెడ్డి, బంధువులు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందించారు. సెప్టెంబర్ 25 గురువారం ఉదయం 8 గంటలకల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె (Gopalarao Palle)కు చేరుకుంటారు. ఇప్పటికే బంధువులు, గ్రామస్తులు మావోయిస్టు నేత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు నిఘా ఉంచారు.
Major blow to #Maoists as top Central Committee leaders Katta Ramachandra Reddy @ Gudsa Usendi / Vijay / Raju / Vikalp (63) (native Karimnagar, #Telangana
Kadari Satyanarayana Reddy @ Kosa / Sadhu / Gopanna / Buchanna (67) (Adilabad, #Telangana) killed in an encounter in Abujhmad… https://t.co/TM5zsaMnRC pic.twitter.com/Lll8X2n4py— Ashish (@KP_Aashish) September 22, 2025
అమ్మనాన్నలు, అన్న, అక్క, బంధువులు.. అందరిని వదిలి ఉద్యమ బాట పట్టిన కడారి సత్యనారాయణ రెడ్డి 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. కట్టుబట్టలు, తన సర్టిఫికెట్లు, ఫొటోలతో పోరుబాట పట్టిన కోసా మళ్లీ ఇంటిముఖం చూడలేదు. తల్లిదండ్రులను కడసారి చూసేందుకు కూడా రాలేదు. తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ టీచర్ కావడంతో ముస్తాబాద్ మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపేటలో సత్యనారాయణ రెడ్డి పదో తరగతి వరకు చదివారు. తరువాత పెద్దపల్లిలోని ఐటీఐలో చేరాడు. అక్కడ చేరినప్పుడు ఆర్ఎస్ఎయూలో పనిచేసే మల్లోజుల వెంకటేశ్వర రావుతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఐటీఐ చదువుపూర్తయ్యాక బసంత్ శ్రీనగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ రెడ్డి.. కార్మికుల హక్కుల కోసం పోరాడాడు.
సత్యనారాయణరెడ్డి స్వగ్రామం
అయితే.. ఫ్యాక్టరీ మేనజర్ హత్య ఉదంతంతో తొలిసారి జైలుకు వెళ్లారు ఆయన. జైలు నుంచి తిరిగొచ్చాక సింగిరేణి కార్మిక సంఘంలో చేరి ఉద్యమాలు చేశాడు సత్యనారాయణ రెడ్డి. అనంతరం పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఆయన.. పలు రాష్ట్రాల్లో మావోయిస్టులతో పనిచేసి, అంచెలచెంలుగా ఎదిగి కేంద్ర కమీటీ సభ్యుడుగా ఎదిగారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర.. తదితర ప్రాంతాల్లో పని చేశారాయన. చెన్నారెడ్డి హయాంలో స్వగ్రామమైన గోపాలరావు పల్లెకు సత్యనారాయణ వచ్చి, వెళ్లినట్లుగా గ్రామస్తులు తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం కుటుంబానికి దూరంగా, నిస్వార్థంగా ఉద్యమం చేశారు సత్యనారాయణరెడ్డి. తనను పట్టిస్తే.. కోట్ల రూపాయాలు ఇస్తామని ప్రకటించినా సరే.. ఆయన లొంగిపోలేదు.
పిన్న వయస్సులో సత్యనారాయణరెడ్డి అందరితో కలుపుగోలుగా ఉండేవారని ఆయన చిన్ననాటి స్నేహితుడు భూంరెడ్డి
తెలిపారు. పత్రికలు, మీడియాల్లో చూడడమే తప్ప ఎప్పుడూ ఆయనను ప్రత్యక్షంగా చూడలేమని గ్రామస్తులు చెబుతున్నారు. కడారి సత్యనారాయణరెడ్డి తన జీవితం అంతా ఉద్యమానికి అంకితం చేయడం, కేంద్ర కమీటి సభ్యుడిగా ఎదగడం తమకు గర్వంగా గ్రామస్తులు అంటున్నారు. ప్రజలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకుడి చివరి చూపు కోసం తామంతా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.