ఎల్లారెడ్డిపేట, జూన్, 8: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన నాగుల తిరుపతి గౌడ్ (40) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన ఆటో సీరియల్ ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.
రాత్రి తిరుగు ప్రయాణంలో కేసీర్ కాలనీ వద్ద ఆటో బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తిరుపతి గౌడ్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.